మనందరం చిన్నప్పుడు చదువుకున్న కథ "నాన్న పులి"
ఆ కథ తెలియని వాళ్ళకోసం ఇక్కడ మల్లి వేస్తున్న.
అనగనగా ఒక ఊరిలో ఒక అబ్బాయి , వాళ్ళ నాన్న ఒకరోజు ఆ అబ్బాయి తో " నాకు ఈరోజు చాల పని ఉంది ఈరోజు మన మేకల్ని మేపడం వీలు పడడం లేదు , ఆ మేకల్ని మేపుకొని రారా" అని చెప్పాడు.
"అయితే అప్పుడప్పుడు ఆ కొండ మీద ఒక పులి ఉంటది అది మేకల్ని ఎత్తుకుపోడానికి వస్తది, అది వచినట్టు అనిపిస్తే, మేకలు అరుస్తాయి, ఒక వేల నీకు అనుమానం వస్తే నాన్న అని గట్టిగా నన్ను పిలువు" అని చెప్పి ఆ అబ్బాయికి మేకలు ఇచ్చి పంపాడు కొండపైకి.
ఆ అబ్బాయి కాసేపయ్యాక ఆ అబ్బాయి "నాన్న పులి నాన్న పులి " అని గట్టిగా అరిచాడు అది విన్న వాళ్ళ నాన్న ఒక నలుగురితో కొండ పైకి ఉరుక్కుంటూ వచ్చాడు. "పులి ఏది " అని అడిగితే ఆ అబ్బాయి "పులి లేదు గిలి లేదు, ఒట్టిగనె పులి వస్తే మీరు వస్తార రారా అని చూసాను" అని నవ్వాడు. వాళ్ళ నాన్న అల చెయ్యకు అని మర్యాద గ చెప్పి వెళ్ళిపోయాడు .
కాసేపయ్యాక మళ్ళి ఆ అబ్బాయి "నాన్న పులి నాన్న పులి " అని గట్టిగా అరిచాడు అది విన్న వాళ్ళ నాన్న ఒక నలుగురితో కొండ పైకి మళ్ళి ఉరుక్కుంటూ వచ్చాడు. "పులి ఏది " అని అడిగితే ఆ అబ్బాయి "పులి లేదు గిలి లేదు, ఒట్టిగనె పులి వస్తే మీరు వస్తార రారా అని చూసాను" అని నవ్వాడు. ఈసారి వాళ్ళ నాన్న చాల గట్టిగా తిట్టి వెనక్కి పొయిన్దు.
ఈసారి నిజంగానే పులి వచ్చింది ఆ అబ్బాయి "నాన్న పులి నాన్న పులి " అని గట్టిగా అరిచాడు అది విన్న వాళ్ళ నాన్న వీడు ఈసారి కూడా ఊరికే అంటున్నాడేమో అని పట్టించుకోలేదు, ఆ పులి వాణ్ణి నోట కరుచుకొని వేల్లిపోయిది.
" అబద్దం ఎంత ప్రమాదకరమైనదో, అబద్దాలు చెబుతుంటే మన "మాట" కున్న విలువ ఎలా తగ్గిపోతుందో ఈ చిన్న కథ ద్వారా తెలుసుకుందాం! కాలు జారితే తీసుకోగలం గానీ.. నోరు జారితే తీసుకోలేమని చెప్పే కథ !
ఇప్పుడు అస్సలు కథ కి వస్తే Dec 9th 2009 మొదలుకొని 12th June 2013 వరకు కాంగ్రెస్ తెలంగాణా నాటకం ఆడుతూనే ఉంది. ప్రతి సారి పులి వచ్చింది అన్న రీతిలో తెలంగాణా ఇచ్చేస్తున్నాం అన్నట్టు ఢిల్లీ లో హడావుడి చెయ్యడం, దాన్ని చూసి రాష్ట్ర నేతలు ఢిల్లీ పయనం అవ్వడం, కాంగ్రెస్ అధిష్టానం వీళ్ళని చూసి వెకిలి నవ్వులు నవ్వడం .
కారణాలు ఎన్నైనా, తెలంగాణా విషయం అంతిమ దశకు చేరుకున్నది అన్నది వాస్తవం. అంతిమ దశ లో కూడా ఇంకా కాంగ్రెస్ అధిష్టానం ఈ నాటకానికి తెరదించక పోవడం ఆశ్చర్యం కలిగిస్తున్న అంశం. ఇప్పుడు ఉన్న పరిస్థితిలో కాంగ్రెస్ తెలంగాణా ఇచ్చినా ఆ పార్టీ కి వోట్లు వేసే విషయం లో తెలంగాణా ప్రజలు సిద్దంగా ఉన్నారా అనేది ప్రశ్నార్థకం, దానికి కారణం కాంగ్రెస్స్ నాయకుల మాటకి వెలువ లెకపొవడం.ఆ విలువ పోగుట్టుకున్నది ఆ పార్టీ నాయకులే కావడం
ఇప్పటికైనా అంతో కొంతో ప్రజా అభిమానం చొరగొనాలంటే, ఇంకా వీరే ప్రకటనలకి పోకుండా ఈ వర్షా కాల పార్లమెంట్ సమావేశాల్లో తెలంగాణా బిల్లు ప్రవేశ పెట్టడం కన్నా కాంగ్రెస్ కి వేరే గత్యంతరం లేదు.
"ప్రజల్ని ఎప్పుడూ మోసం చెయ్యడం అంత సులభం కాదని కాంగ్రెస్ పార్టీ తెలుసుకునే రోజులు దగ్గర పడ్డాయి"
-సంకీర్త్